బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవుల్లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ తర్వాత రోజుల్లో స్లో డౌన్ అయిన బంగార్రాజు సినిమా ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ నే సాధిస్తుంది కానీ అది మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి ఒక్కో అడుగు దగ్గర చేస్తున్నా కానీ వీకెండ్ అడ్వాంటేజ్ తో మరింత ముందుకు వెళ్ళాల్సింది కానీ…
సినిమా మరీ అనుకున్న రేంజ్ లో అయితే వీకెండ్స్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 17 వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటం వలన ఎలాగోలా గ్రోత్ ని చూపెట్టింది కానీ అది మరీ అద్బుతం అనిపించే రేంజ్ లో లేదు కానీ గ్రోత్ ఉండటం విశేషం.
సినిమా మొత్తం మీద 20-25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా సినిమా 33 లక్షల మార్క్ ని అందుకుని డీసెంట్ గ్రోత్ ని చూపెట్టింది కానీ బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్ట పడాల్సిన అవసరం ఉంది సినిమా కి. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర….
మూడో వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 8.25Cr
👉Ceeded: 6.75Cr
👉UA: 5.13Cr
👉East: 4.09Cr
👉West: 2.87Cr
👉Guntur: 3.41Cr
👉Krishna: 2.23Cr
👉Nellore: 1.74Cr
AP-TG Total:- 34.47CR(56Cr~ Gross)
👉Ka+ROI: 1.76Cr
👉OS – 1.48Cr
Total WW: 37.71CR(63.35CR~ Gross)
ఇదీ సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
సినిమా ను మొత్తం మీద 38.15 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 17 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.29 కోట్లు సాధించాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ డేస్ లో కూడా సినిమా స్టడీగా పరుగును కొనసాగిస్తేనే బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.