బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతున్న బంగార్రాజు సినిమా ఇప్పుడు మూడో వీకెండ్ ఆదివారం రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి డీసెంట్ అనిపించుకున్నా కానీ అది అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని సాధించే రేంజ్ కాదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల లో 16 వ రోజు తో పోల్చితే మొత్తం మీద 20% వరకు డ్రాప్ అయినా కానీ తిరిగి…
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని చూపెట్టినా కానీ ఓవరాల్ గా సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 16 నుండి 18 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం గ్రోత్ ని….
చూపిస్తే కనుక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. సినిమా ఇంకా బెటర్ గా వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు…