బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ మంత్ మూవీస్ లో వెంకిమామ అండ్ ప్రతీ రోజూ పండగే సినిమాలు దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్నాయి, మధ్యలో బాలయ్య రూలర్ చాప చుట్టేయగా కొత్త సినిమాల్లో మత్తు వదలరా సినిమా మంచి వసూళ్ళ ని సాధిస్తూ ఇయర్ ఎండ్ లో మరో హిట్ గా నిలిచింది అని చెప్పాలి. మొత్తం మీద అన్ని సినిమాల ఆదివారం కలెక్షన్స్ అప్ డేట్ ని గమనిస్తే…
ముందుగా వెంకిమామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో 35 కోట్ల క్లబ్ లో చేరగా సినిమా 16 వ రోజు 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, దాంతో సినిమా 17 వ రోజు ఆదివారం మరో సారి దుమ్ము లేపే చాన్స్ ఉంది. కలెక్షన్స్ 50 లక్షల మార్క్ ని అందుకోవచ్చు అని చెప్పొచ్చు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య రూలర్ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది, సినిమా కు పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నా కానీ కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు వెళ్ళడం లేదు. 9 రోజుల్లో 9.4 కోట్ల మార్క్ ని దాటిన సినిమా 10 వ రోజు 16 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
ఇక ఇయర్ ఎండ్ బ్లాక్ బస్టర్ ప్రతీ రోజూ పండగే 9 రోజుల్లో ఆల్ మోస్ట్ 23 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోగా 9 వ రోజు 1.4 కోట్ల షేర్ ని సాధించింది, 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతకుమించిన షేర్ ని అందుకోవచ్చు, మినిమమ్ లెక్క 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల దాకా ఉండే చాన్స్ ఉందని అంటున్నారు.
ఇక దొంగ సినిమా 9 రోజుల్లో 1.6 కోట్ల షేర్ ని అందుకోగా రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే 4 రోజుల్లో 54 లక్షల షేర్ ని అందుకుంది, ఇక మత్తు వదలరా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండగా అఫీషియల్ కలెక్షన్స్ ని రివీల్ చేయలేదు. ఓవరాల్ గా సినిమా 4 రోజుల్లో 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చని టాక్.