Home గాసిప్స్ బాలయ్య ఆ నిర్మాత హాట్రిక్ మూవీ…వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!

బాలయ్య ఆ నిర్మాత హాట్రిక్ మూవీ…వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!

0

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో హిట్స్ ఫ్లాఫ్స్ కామన్ గా తీసుకుంటారు, హిట్స్ వచ్చిన డైరెక్టర్స్ తోనే నిర్మాతలతోనే చేస్తే కెరీర్ బాగుంటుంది అనుకోరు, ఫ్లాఫ్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మంచి కథ తేండి మనం మళ్ళీ పనిచేద్దాం అని చెబుతారు. ఈ విషయాన్నీ అనేక మంది డైరెక్టర్ లు మరియు నిర్మాతలు ఓపెన్ గానే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే బాలయ్య వీక్ నెస్ గా తీసుకుని… కథల విషయంలో…

పెద్దగా శ్రద్ధ పెట్టకుండానే చాలా సినిమాలను బాలయ్యతో చేయించారు కొందరు… అందులో అడపాదడపా హిట్స్ పడ్డా కానీ కొన్ని నాసిరకం సినిమాలు కూడా వచ్చాయి. వాటితో పోల్చితే కొంచం బెటర్ రిజల్ట్ నే బాలయ్య కి ఇచ్చేలా చేసిన నిర్మాతలలో సి కళ్యాణ్ కూడా ఒకరు.

బాలయ్య తో కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రెండు సినిమాలను నిర్మించిన సి కళ్యాణ్ అందులో ఒక విజయాన్ని ఒక అపజయాన్ని సొంతం చేసుకున్నాడు, జై సినిమా సినిమా సంక్రాంతి రేసులో విజయాన్ని నమోదు చేసుకోగా 2019 లో వచ్చిన రూలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను దక్కించుకుంది.

సినిమాల రిజల్ట్ ని పక్కకు పెడితే క్వాలిటీ పరంగా ఈ రెండు సినిమాలు కొంచం అంతంత మాత్రంగానే ఉంటాయి అని టాక్ వచ్చింది, అలాగే బాలయ్య గెటప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తీసారు అని ఫ్యాన్స్ కూడా కోపగించుకున్నారు. రూలర్ లో స్లిమ్ లుక్ ఎంత ఫ్రెష్ గా మెప్పించిందో అదే టైం లో పోలిస్ గెటప్ భారీ ట్రోల్స్ కూడా జరిగాయి…

జై సింహా విషయం లో కూడా ఇదే జరిగింది…. ఇక సినిమాల అప్ డేట్స్ కూడా చాలా ఆలస్యంగా ఇచ్చేవారని కంప్లైంట్ ఉంది… దాంతో ఈ నిర్మాత వద్దు బాబోయ్ అంటూ ఫ్యాన్స్ నో చెప్పినా రీసెంట్ గా బాలయ్యతో హాట్రిక్ మూవీ నిర్మించబోతున్నాం అంటూ సి కళ్యాణ్ కన్ఫాం చేశాడు. దాంతో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ వద్దూ అంటూనే ఈ సారి అయినా ఈ విషయాలను సరిదిద్దుకోవాలని ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here