Home న్యూస్ సంక్రాంతి మూవీస్(17-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

సంక్రాంతి మూవీస్(17-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా పండగ సెలవులను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి. ఉన్నంతలో హనుమాన్ మూవీ మిగిలిన అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. సైంధవ్ మూవీ కంప్లీట్ గా డౌన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొత్తం మీద హనుమాన్(HanuMan Movie) 6వ రోజు నైజాంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది, ఆంధ్ర అండ్ సీడెడ్ లో కూడా మంచి జోరుని చూపిస్తూ ఉండగా మొత్తం మీద ఈ రోజు సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే 4-4.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా సినిమా 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు….

ఇక గుంటూరు కారం(Guntur Kaaram Movie) 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఆంధ్ర సీడెడ్ లో కూడా కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా కూడా  అక్కడ కూడా డ్రాప్స్ గట్టిగానే ఉండగా మొత్తం మీద సినిమా 6వ రోజు 4-4.5కోట్లకు అటూ ఇటూగా షేర్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకోవచ్చు.

ఇక 5వ రోజులో అడుగు పెట్టిన సైంధవ్(Saindhav Movie) హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా ఉన్నంతలో బాక్స్ ఆఫీస్ దగ్గర 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజులో అడుగు పెట్టిన నా సామి రంగ(Naa Saami Ranga Movie)….

మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఉన్నంతలో 2-2.2 కోట్ల దాకా షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అన్ని సినిమాలు ఇవే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటాయా లేక కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here