Home న్యూస్ 17 ఏళ్ల ఎపిక్ మాస్ విక్రమార్కుడు…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

17 ఏళ్ల ఎపిక్ మాస్ విక్రమార్కుడు…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

0

17 Years for Vikramarkudu – జింతా త చితా చితా అంటూ మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన సినిమా విక్రమార్కుడు(Vikramarkudu)… పోకిరి(Pokiri) బాక్స్ ఆఫీస్ ప్రభంజనం కొనసాగుతున్న టైం లో ఆ ప్రవాహంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా పెద్దగా పోటి ఇవ్వలేక పోతున్న తరుణం లో బరిలోకి దిగిన ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) రవితేజ(Raviteja) ల కాంబినేషన్ లో వచ్చిన కమర్షియల్ మూవీ విక్రమార్కుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

దుమ్ము దుమారం లేపే విజయాన్ని నమోదు చేసుకుంది. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ రాథోడ్ లాంటి రెండు కంప్లీట్ డిఫెరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో రవితేజ కెరీర్ బెస్ట్ కమర్షియల్ వాల్యూస్ తో వచ్చిన విక్రమార్కుడు ఫస్ట్ ఆఫ్ ఎంత కామెడీ తో నవ్విస్తుందో సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి…

అంతే సీరియస్ గా మారి విక్రమ్ రాథోడ్ ఫ్లాష్ బ్యాక్ అదే రేంజ్ లో ఆకట్టుకునేలా చేసి తర్వాత సత్తిబాబు విక్రమ్ రాథోడ్ గా మారి చేసే రచ్చ తో పీక్స్ కి చేరుతుంది. ఎస్ ఎస్ రాజమౌళి కమర్షియల్ ఎలిమెంట్స్ ని అద్బుతంగా తీయగా రవితేజ ఆ పాత్రలకు ఫుల్ ప్రాణం పోశాడు.

బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో రవితేజ కెరీర్ బెస్ట్ రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 19 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుని రవితేజ కెరీర్ కి తిరుగు లేని క్రేజ్ ని కంటిన్యూ అయ్యేలా చేసింది. అసలు రవితేజ తప్ప ఆ రోల్స్ ని మరెవరూ కూడా చేయలేరు…

ఏమో అనిపించేలా మెస్మరైజ్ చేసిన విక్రమార్కుడు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యింది కానీ రవితేజని ఎవ్వరూ కూడా మ్యాచ్ చేయలేక పోయారు. ఇంటర్వెల్ సీన్ ఒక్కటి టికెట్ డబ్బులకి సమానం అనిపించే రేంజ్ లో దుమ్ము లేపిన విక్రమార్కుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 17 ఏళ్లని పూర్తీ చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here