Home న్యూస్ 180 కోట్ల సినిమా….ఈ రేటింగ్స్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

180 కోట్ల సినిమా….ఈ రేటింగ్స్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ షంషేర సినిమా బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి కాగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు కొద్ది వరకు పెరిగాయి. ట్రైలర్ చూసిన తర్వాత కొద్దిగా కేజిఎఫ్ సిరిస్, బాహుబలి లాంటి గ్రాండియర్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచగా సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని 2 స్టార్ రేంజ్ లో రేటింగ్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది సినిమా… మొత్తం మీద ఏకంగా 180 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా లో…

రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినా కానీ కథ చాలా నెమ్మదిగా ఉండటం, కథ మొత్తం ఔట్ డేటెడ్ గా ఉండటంతో చూసిన వాళ్ళు తలపట్టుకు కూర్చున్నారు… దాంతో సినిమా పై కంప్లీట్ నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వగా ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై తీవ్రంగా ప్రభావం చూపింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా ఏ దశలో కూడా బడ్జెట్ కి న్యాయం చేయలేక పోయింది. సినిమా మొదటి రోజు కేవలం 10.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, రెండో రోజు గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉండగా సినిమా మరోసారి 10.1 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇక వీకెండ్ కలెక్షన్స్ తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా భారీగా స్లో అయ్యేలా కనిపిస్తూ ఉండగా బడ్జెట్ పరంగా సినిమా భారీ డిసాస్టర్ గా నిలవడం ఇక కన్ఫాం అనే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తం మీద ఓ భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ కి సినిమా మరోసారి తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here