నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా పై ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాఫ్ ఎఫెక్ట్ ఇసుమంత కూడా పడక పోవడం విశేషం. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ విషయానికి వస్తే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది ఈ సినిమా.
మొత్తం మీద మాస్ సెంటర్స్ లో 70% వరకు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా క్లాస్ సెంటర్స్ లో 40% వరకు ఓపెనింగ్స్ ని అందుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా జోరు అందుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాస్ సెంటర్స్ కూడా…
మరింత జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ దృశ్యా 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ షేర్ ని అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించే గ్రోత్ ని బట్టి…
ఫైనల్ లెక్క 4.5 కోట్ల నుండి 5 కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద 4 సినిమాల నడుమ పోటి లో ఇది అల్టిమేట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి, ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.