Home న్యూస్ మాస్ జాతర…బంగార్రాజు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!!

మాస్ జాతర…బంగార్రాజు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!!

0

కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. మొదటి రోజు అంచనాలను సాలిడ్ గా మించిపోయిన సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా కి కొన్ని చోట్ల హైర్స్ కూడా యాడ్ అవ్వడంతో ఓవరాల్ కలెక్షన్స్ అంచనాలను మించిపోయాయి.

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంటుంది అనుకుంటే సినిమా అనుకున్నట్లే 6.99 కోట్ల వర్త్ షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా హైర్స్ 2.07 కోట్లు సినిమా కి మొదటి రోజు…

ఆంధ్రప్రదేశ్ లో పలు ఏరియాల్లో యాడ్ అయ్యి టోటల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 9.06 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకి ప్రింట్స్ లేట్ వెల్లడం వలన అక్కడ కలెక్షన్స్ కొంచం అనుకున్న రేంజ్ లో రాలేదు, అయినా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా…

బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.06Cr
👉Ceeded: 1.80Cr(43L Hires)
👉UA: 1.27Cr(46L Hires)
👉East: 86L(23L Hires)
👉West: 89L(38L hires)
👉Guntur: 1.18Cr(45L Hires)
👉Krishna: 47L
👉Nellore: 53L(12L Hires)
AP-TG Total:- 9.06CR(14CR~ Gross)(2.07Cr Hires)
👉Ka+ROI: 0.80Cr
👉OS – 0.50Cr
Total WW: 10.36CR(17CR~ Gross)

ఇదీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లెక్క…

ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ ని అన్ని చోట్ల సొంతం చేసుకున్న సినిమా టోటల్ బిజినెస్ 38.15 కోట్లు కాగా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 28.64 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక రెండో రోజు సినిమా బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here