Home న్యూస్ హీరో రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

హీరో రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

0

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా హీరో ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ట్రైలర్ లో సినిమా కథ ఏంటి అనేది అస్సలు చెప్పకుండా రిలీజ్ చేయగా సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కథ గురించి ఎలాంటి క్లూ లేకుండా వచ్చింది. మరి వచ్చాక కథ పరంగా ఇంప్రెస్ చేసిందా, హీరోగా అశోక్ గల్లా ఆకట్టు కున్నాడా తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే మిడిల్ క్లాస్ యువకుడు, హీరో అవ్వలాని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, తన ఎదురింట్లో ఉండే హీరోయిన్ నిధితో లవ్ లో పడతాడు… హీరో గా ప్రయత్నాలు చేస్తున్న టైం లో తనకి కొరియర్ లో ఓ గన్ వస్తుంది. ఆ గన్ రాకతో తన లైఫ్ టర్న్ తీసుకుంటుంది.

ఇంతకీ ఆ గన్ ఎక్కడ నుండి వచ్చింది తర్వాత ఏమయింది అన్నది మిగిలిన కథ… కొన్ని సినిమాల కథలు సిల్లీగా ఉన్నా కథనం స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి… ఈ హీరో సినిమా ఫస్టాఫ్ వరకు ఈ కోవలోకే చెందుతుంది, ఎంటర్ టైన్ మెంట్ చాలా వరకు ఫస్టాఫ్ లో వర్కౌట్ అవ్వడంతో ఫస్టాఫ్ బాగా మెప్పించి…

సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచుతుంది, కానీ సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను నిజం చేయలేక ట్రాక్ తప్పుతుంది, కానీ అక్కడక్కడా కామెడీ సెకెండ్ ఆఫ్ లో కూడా మెప్పించడంతో ఫ్లాస్ ని మర్చిపోయి చూడగలిగితే సినిమా ఆకట్టుకునేలానే ముగుస్తుంది. సెకెండ్ ఆఫ్ పై ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ఔట్ పుట్ ఇంకా చాలా బెటర్ గా ఉండేది…

హీరోగా అశోక్ గల్లా ఆకట్టుకోగా నటన పరంగా ఇంకా మెరుగు అవ్వాలి, డాన్సులు బాగున్నాయి… నటనకి స్కోప్ ఉన్న పాత్రలో చాలా వరకు ఇంప్రెస్ చేయగలిగాడు.. హీరోయిన్ నిధి మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ బాగా నటించారు… సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ సినిమా కి హైలెట్ అవ్వగా, సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి మేజర్ హైలెట్స్ గా చెప్పుకోవాలి…

చాలా రిచ్ గా ఉన్న సినిమా, ఎంటర్ టైన్ మెంట్ బాగుండటం, సాంగ్స్ మెప్పించడం, ఫస్టాఫ్ ఆకట్టుకోవడం లాంటివి హైలెట్ అయినా సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పడం, కథ కొంచం సిల్లీగా ఉండటం లాంటివి డ్రా బ్యాక్స్ అయ్యాయి, కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్లి కథని పట్టించుకోకుండా చూస్తె…. ఆడియన్స్ ని సినిమా చాలా వరకు ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here