Home న్యూస్ ఖిలాడి 1st డే కలెక్షన్స్….ఎక్స్ లెంట్….కానీ!!

ఖిలాడి 1st డే కలెక్షన్స్….ఎక్స్ లెంట్….కానీ!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ బుకింగ్స్ ఓపెన్ అయినా కానీ ఆన్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో జరగలేదు, కానీ ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్లు…..

ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్స్ వలన ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…. హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడిన ఖిలాడి నైజాంలో మాత్రం ఎక్కువ థియేటర్స్ వలన ఆక్యుపెన్సీ అనుకున్న రేంజ్ లో లేదు… అలాగే ఎక్కువ థియేటర్స్ వలన….

షేర్స్ కొంచం తగ్గే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొంచం గ్రోత్ ఉన్నా కానీ అది అనుకున్న రేంజ్ లో అయితే లేదు… కానీ ఆంధ్రలో కుమ్మేసిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునేలా ఉందని చెప్పాలి….

కానీ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే 4.5 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది కానీ సినిమా ఓవరాల్ బుకింగ్స్ ని చూస్తుంటే ఇది కొంచం కష్టంగానే ఉందని చెప్పాలి. ఇక సినిమా హిందీలో ప్రింట్స్ లేట్ రిలీజ్ వలన లేట్ రిలీజ్ అయినా అక్కడ బుకింగ్స్ కుమ్మేశాయి… మొత్తం మీద ఇప్పుడు మొదటి రోజు సినిమా….

ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 4.5 కోట్ల మార్క్ రేంజ్ ని అందుకుంటే అది సాలిడ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. కానీ నైజాంలో హోల్డ్ అండ్ గ్రోత్ బాగుంటే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్ళేది… మరి ఓవరాల్ గా అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఈ రేంజ్ లోనే ఉంటాయా లేక లెక్క ఇంకా మించుతుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here