విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పుష్పక విమానం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ లభించింది, బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని సినిమాల మీద ఉన్నట్లు గానే ఈ సినిమా మీద కూడా కనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి మరీ అంచనాలను మించి…
గ్రోత్ ఏమి కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయ్యింది ఈ సినిమా, ఫస్ట్ డే 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని భావించగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 35 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.
అందులో నైజాంలో 11 లక్షలు, సీడెడ్ లో 4 లక్షలు టోటల్ ఆంధ్రాలో 20 లక్షల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 లక్షల దాకా షేర్ ని అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 17 లక్షల దాకా షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.
దాంతో సినిమా మొత్తం మీద మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 55 లక్షల దాకా షేర్ ని 1 కోటి దాకా గ్రాస్ ను ఓవరాల్ గ్రాస్ ను మొదటి రోజు సొంతం చేసుకుంది. సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ రేటు కి టోటల్ వరల్డ్ వైడ్ గా అమ్మారు. దాంతో సినిమా క్లీన్ హిట్ అందుకోవాలి అంటే 2.3 కోట్ల రేంజ్ టార్గెట్ ని అందుకోవాల్సి…
ఉండగా మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, అంటే వీకెండ్ లో కొంచం గట్టిగా హోల్డ్ చేస్తే వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, ఇక సినిమా వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.