Home న్యూస్ ఆ సినిమాల లైఫ్ టైం….బేబి డే 1 ఔట్….మాస్ రచ్చ ఇది!!

ఆ సినిమాల లైఫ్ టైం….బేబి డే 1 ఔట్….మాస్ రచ్చ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పుడు నటించిన లేటెస్ట్ మూవీ బేబి(Baby The Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ..

తొలిరోజు ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేసింది… కాగా ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 2.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 6.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించింది.

కాగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్క హీరోగా ఆనంద్ దేవరకొండ నటించి థియేటర్స్ లో రిలీజ్ అయిన దొరసాని, పుష్పక విమానం లాంటి సినిమాల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

Baby The Movie 1st Day Collections- Sensational Openings!

దొరసాని సినిమా టోటల్ రన్ లో 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంటే పుష్పక విమానం సినిమా టోటల్ రన్ లో 3.20 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని రెండూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. మధ్యలో చేసిన మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమా…

డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు బేబి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన 2 సినిమాల టోటల్ గ్రాస్ 5.55 కోట్ల కన్నా కూడా ఆల్ మోస్ట్ కోటి ఎక్కువగా గ్రాస్ వసూళ్ళతో హీరో కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ మూవీ గా మొదటి రోజే నిలిచింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here