డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకున్నట్లే చేసుకుని సడెన్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన సినిమా రాజ రాజ చోర. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ అంటూ రిలీజ్ కి ముందు నుండే మంచి పబ్లిసిటీ చేయగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి ఆటకే ఆడియన్స్ మనసును…
చాలా వరకు గెలుచుకుని మంచి ఎంటర్ టైనర్ గా దూసుకు పోతుంది. కానీ చిన్న సినిమా అవ్వడం తో ఓపెనింగ్స్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. సినిమాను మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 260 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు….
జీ నెట్ వర్క్ వాళ్ళు సినిమా అన్ని హక్కులను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ బిజినెస్ ఓన్ గానే చాలా ఏరియాల్లో థార్డ్ పార్టీ బయర్స్ తో కలిసి రిలీజ్ చేశారు, కానీ ఓవరాల్ వర్త్ బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా మొదటి రోజు ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో…
25% రేంజ్ లో ఓవరాల్ ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుని రన్ అయ్యింది. ఈవినింగ్ షోలకి కొంచం బెటర్ గ్రోత్ ఉన్నా ఓవరాల్ గా మరీ అనుకున్న రేంజ్ లో లేదు, కానీ చిన్న సినిమా కాబట్టి ఈ టైం లో ఈ ఓపెనింగ్స్ గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో…
30 నుండి 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగి అంచనాలను మించి 50 లక్షల దాకా వెళితే ఓవరాల్ గా సాలిడ్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకున్నట్లు చెప్పొచ్చు. మరి సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.