ఎవరు ఎన్ని అన్నా రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే చూసే ఒక వర్గం ఎప్పుడూ ఉంటారు అని మరోసారి నిరూపితం అయింది, రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుని చాలా ఏళ్ళు అవుతుంది అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో రక్తచరిత్ర హిట్ తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఏవి కూడా హిట్ గీత దాటలేదు.
లాస్ట్ ఇయర్ నుండి కరోనా తో థియేటర్స్ కొన్ని నెలలు తప్పితే మిగిలిన టైం మొత్తం లాక్ డౌన్ లకే సరిపోగా రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న సినిమాలు తీసి వాటి ద్వారా డబ్బులు బాగానే వెనకేశాడు, అలా తీసిన మరో సినిమానే D కంపెనీ…
ఈ సినిమాను రీసెంట్ గా కొత్త OTT ప్లాట్ ఫాం స్పార్క్ OTT లో ని లాంచ్ చేస్తూ అందులో ఈ సినిమాను రిలీజ్ చేశారు, సినిమా కి రామ్ గోపాల్ వర్మ ఇతర సినిమాల మాదిరిగానే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ డే వ్యూస్ పరంగా మాత్రం దుమ్ము లేపింది.
స్పార్క్ OTT లాంచ్ ను స్టార్స్ తో ట్వీట్స్ వేయించి లాంచ్ చేయగా 12 గంటల్లోనే 1.2 లక్షల మంది సబ్ స్రైబ్ అయ్యారు… ఇక 24 గంటల్లో ఆల్ మోస్ట్ 1.8 లక్షల మంది ఈ యాప్ ను సబ్ స్రైబ్ చేసుకున్నారని సమాచారం. ఇక ఇందులో ఈ సినిమా కి దక్కిన వ్యూస్ ఓవరాల్ గా 1.6 లక్షల దాకా ఉన్నాయని తెలుస్తుంది….
అంటే అంత మంది కూడా స్పార్క్ ఇయర్ సబ్ స్రైబ్ రేటు పెట్టి కొని ఈ సినిమా ను చూశారు, అంటే అందులో రామ్ గోపాల్ వర్మ కి సాలిడ్ గా డబ్బులు వెళ్ళాయి అంటున్నారు, వ్యూస్ ఈ రేంజ్ లో రావడం చూస్తుంటే అది కూడా ఒక కొత్త OTT లో రావడం రామ్ గోపాల్ వర్మ మూవీస్ కి ఇప్పటికీ ఆడియన్స్ ఉన్నారని మరోసారి నిరూపించడమే అని చెప్పొచ్చు.