Home న్యూస్ RGV వ్యూహం దెబ్బ…..బాక్స్ ఆఫీస్ విల విల!!

RGV వ్యూహం దెబ్బ…..బాక్స్ ఆఫీస్ విల విల!!

0

రీసెంట్ టైంలో ఎలక్షన్స్ దగ్గర పడటంతో వరుస పెట్టి పొలిటికల్ నేపధ్యంలో సినిమాలు వస్తున్నాయి కానీ వాటిలో ఏవి కూడా ఆడియన్స్ ను అలరించ లేక పోతున్నాయి. అన్నింటికి అన్ని సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ లనే సొంతం చేసుకోగా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన…

వ్యూహం(Vyooham Box Office Collections) సినిమా ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పారడీ మూవీని తలపిస్తూ లో క్వాలిటీతో తెరకెక్కిన ఈ సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. మొదటి ఆటకే అట్టర్ ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా…..

కనీసం థియేటర్స్ రెంట్స్ ఖర్చులను కూడా రికవరీ చేయలేక చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి… ఓవరాల్ గా ట్రాక్ చేసిన థియేటర్స్ లో గ్రాస్ పట్టుమని 15-20 లక్షల రేంజ్ లో కూడా లేదంటే ఏ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

నిరాశ పరిచిందో అర్ధం చేసుకోవచ్చు… లిమిటెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ పేరు మీద ప్రజెంట్ పొలిటికల్ హీట్ లో జనాలను థియేటర్స్ కి రప్పిస్తుంది అనుకున్నారు కానీ పట్టుమని వీకెండ్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేక పోయింది ఈ సినిమా….దాంతో రామ్ గోపాల వర్మ ఖాతాలో మరో డిసాస్టర్ గా ఈ సినిమా నిలిచింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here