కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మంచి వసూళ్ళని సాధించింది అని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 55 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా ఇంకా గ్రోత్ ని సొంతం చేసుకుని….
మొదటి రోజు మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు లో సినిమా బిజినెస్ రేంజ్ 2.5 కోట్లు కాగా 2.70 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఇంకా 1.85 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుందని చెప్పాలి.
ఇక సినిమా తమిళనాడు లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం, ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ లెక్క ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉండగా సినిమా తమిళనాడులో మొదటి రోజు ఇప్పుడు 28.90 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…
ఇక సినిమా కర్ణాటకలో మొదటి రోజు 4.1 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక కేరళలో మొదటి రోజు 1.3 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుందని అంచనా వేయగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 1.2 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుందని అంచనా…. దాంతో సినిమా టోటల్ గా మొదటి రోజు ఇండియాలో 37.2కోట్ల ను అందుకున్నట్లు…..
ట్రేడ్ వర్గాల అంచనా… ఇక సినిమా ఓవర్సీస్ లో సినిమా మొత్తం మీద 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 50.20 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు అంచనా వేస్తున్నారు… ఇది సెన్సేషనల్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…