బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతున్నా కానీ రెగ్యులర్ మూవీ గోర్స్ కి మాత్రం కొంచం ఓపికతో చూస్తె ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా ఉందని చెప్పాలి. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నా ఓవరాల్ గా కథ పెద్దగా లేక పోవడం మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పాలి…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ విషయానికి వస్తే సినిమా తమిళనాడు లో పెద్దగా ప్రమోషన్స్ లాంటివి పెద్దగా లేకున్నా కానీ సినిమా ఊరమాస్ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది అనే చెప్పాలి. రీసెంట్ టైం లో మాస్టర్ మరియు అన్నాట్టే సినిమాల రేంజ్ కన్నా కూడా….
బెటర్ గా సినిమా బుకింగ్స్ ఉన్నాయని అంటున్నారు అక్కడ ట్రేడ్ వర్గాలు, దాంతో తమిళనాడు లో సినిమా అద్బుతమైన కలెక్షన్స్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా మొదటి రోజు అక్కడ….
25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని అంటున్నారు, ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓపెనింగ్స్ యావరేజ్ అనిపించే లెవల్ లో ఉన్నాయని చెప్పాలి. సినిమా ఇక్కడ ఉన్నంతలో తొలిరోజు భారీ రిలీజ్ ని సొంతం చేసుకున్నా మల్టీ ప్లెక్సులలో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా సినిమా సింగిల్ స్క్రీన్స్ లో బిలో యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది….
సినిమా మొత్తం మీద ఇప్పుడు మొదటి రోజు 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా ఇంకా బెటర్ గా ఉంటే ఈ లెక్క కన్నా కొంచం బెటర్ గా ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. మరి సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…