బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగి పోయింది, తెలుగు రాష్ట్రాల నుండే ఎక్కువ కలెక్షన్స్ మునుపటి కన్నా ఎక్కువ రేంజ్ లో వస్తున్నాయి. పెద్ద సినిమాలకు విపరీతంగా పెంచిన టికెట్ రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు లాంటివి కలిసి వచ్చి ఫస్ట్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా తర్వాత సినిమా ల రేంజ్ ని బట్టి మొదటి వారం లో…
కలెక్షన్స్ సొంతం అవుతున్నాయి. టాలీవుడ్ లో ఈ మధ్య కాలం లో మొదటి వారం లోనే భారీ మొత్తాన్ని రికవరీ చేసిన సినిమాలు ఉన్నాయి. వాటిలో ముందుగా బాహుబలి సిరీస్ ను గమనిస్తే… 6 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి సినిమా మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 61.4 కోట్లు వసూల్ చేయగా…
4 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2 సినిమా ఎవ్వరికీ అందనంత ఎత్తులో 117.92 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ 5 మూవీస్ ని గమనిస్తే… టాప్ 5 ప్లేస్ లో లేటెస్ట్ పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ మొదటి వారంలో…
రెండు తెలుగు రాష్ట్రాలలో 72.28 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా, 4 వ ప్లేస్ లో సాహో సినిమా 74.92 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో ప్లేస్ లో సైరా నరసింహా రెడ్డి 84.49 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా 84.82 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
ఇక టాప్ ప్లేస్ లో అల వైకుంటపురంలో సినిమా 88.25 కోట్ల షేర్ ని అందుకుని నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ లో నిలిచింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన 2 సినిమాలు నువ్వా నేనా అన్నట్లు పోటి పడి మొదటి వారంలో సంచలన కలెక్షన్స్ ను సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వకీల్ సాబ్ ఫస్ట్ వీక్ లో అనేక అవరోధలాను ఎదురుకుని టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది.