శర్వానంద్ సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “జాను”, తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “96” మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా గత వారం రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం చేతులు ఎత్తేసింది.
వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపెట్టని ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం కలెక్షన్స్ పరంగా బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేదు. ఇక 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా 10 లక్షల రేంజ్ షేర్ ని మాత్రమె వసూల్ చేసింది.
మొత్తం మీద మొదటి వారం కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.68Cr
?Ceeded: 84L
?UA: 1.12Cr
?East: 45L
?West: 34L
?Guntur: 56L
?Krishna: 46L
?Nellore: 21L
AP-TG Total:- 6.66CR??
Ka & ROI: 0.42Cr
OS: 0.84Cr
Total WW: 7.92CR(14.16Cr Gross)
ఇదీ మొత్తం మీద మొదటి వారం జాను సినిమా కలెక్షన్స్ పరిస్థితి. సినిమా ను టోటల్ గా 18.5 కోట్లకు అమ్మారు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మొదటి వారం సాధించిన 7.92 కోట్ల షేర్ కాకుండా మిగిలిన రన్ లో మరో 11.28 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
అది దాదాపు అసాధ్యమే కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది. డబుల్ డిసాస్టర్ ని అడ్డుకోవాలి అంటే మినిమమ్ 9.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, మరి ఏం జరుగుతుందో ఈ వీకెండ్ తో తేలనుంది.