బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి కొంచం బెటర్ గా ఉండేదేమో కానీ పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ ఖాళీ పీలి పరిస్థితి మాత్రం ఊహకందని లెవల్ లో ఉందని చెప్పొచ్చు. స్టార్ కిడ్స్ పై ఏర్పడిన వ్యతిరేకత పీక్స్ లి వెళ్ళడం తో అసలు ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకొనే లేదు. దానికి తోడూ సినిమా కూడా అంతంత మాత్రమే ఉండటం తో….
మరింత నెగటివిటీ ఈ సినిమా చుట్టూ అల్లుకుంది, అనన్య పాండే ఇషాన్ ల కాంబినేషన్ లో 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ లు పర్వాలేదు అనిపించే విధంగా ఆకట్టుకున్నా భారీ రేటు పెట్టి కొనడానికీ ఎవ్వరూ ముందుకు రాలేదు..
దాంతో జీ 5 వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాను 299 టికెట్ రేటు తో రిలీజ్ చేశారు అక్టోబర్ 2 న… మొత్తం మీద మొదటి వారానికి గాను సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు ఇప్పుడు ట్రేడ్ లో షాకింగ్ గా మారాయని చెప్పాలి. సినిమా కి మొత్తం మీద…..
మొదటి వారం లో అన్నీ కలిపి అక్షరాలా 20 వేల వ్యూస్ కూడా రాలేదని అంటున్నారు. దాంతో సినిమా టికెట్ రేటు 299 చొప్పున మొత్తం మీద 20 వేల వ్యూస్ కి 60 లక్షల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ మాత్రమె దక్కగా… యూనిట్ కి అందులో 48 లక్షల దాకా.. జీ ప్లెక్స్ కి 12 లక్షల దాకా వెళుతుంది… అంటే సినిమా 25 కోట్ల బడ్జెట్ కి…తిప్పి తిప్పి కొడితే….
50 లక్షల షేర్ ని కూడా మొదటి వారం లో అందుకోలేదు అనే చెప్పాలి. ఇది నిజంగానే ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ అని చెప్పాలి. ఈ రిజల్ట్ చూసి యూనిట్ మొత్తం షాక్ లో ఉండగా జీ ప్లెక్స్ మాత్రం భారీ రేటు పెట్టి కొంటె నష్టాలు వచ్చేవి ఇప్పుడు సేఫ్ లో ఉన్నాం అనుకుంటున్నారు. ఇక రెండో వీకెండ్ లో అయినా ఏమైనా ఇంప్రూవ్ మెంట్స్ ఉంటాయో చూడాలి.