Home న్యూస్ 25 కోట్ల బడ్జెట్…11 కోట్ల రేటు…. 1st వీక్ లో వచ్చింది ఇది!

25 కోట్ల బడ్జెట్…11 కోట్ల రేటు…. 1st వీక్ లో వచ్చింది ఇది!

0

దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా ఆడియన్స్ కి పరిచయం అయిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్… అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను భారీగా తెరకెక్కించగా సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు… ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమాను నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో దిల్ రాజు అండతో…

భారీగా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అయితే మిక్సుడ్ గానే వచ్చింది అని చెప్పాలి. సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉన్నా పండగ టైం లో మట్టుకు వీకెండ్ లో మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్న ఈ సినిమా…

తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అయిపొయింది. దాంతో కలెక్షన్స్ పరంగా డెబ్యూ హీరో మూవీ కి మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్నా కానీ సినిమా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 11 కోట్ల రేంజ్ లో ఉండటం తో సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్…

ఆ బిజినెస్ ను అందుకునే రేంజ్ లో అయితే లేవు. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.22Cr
👉Ceeded: 61L
👉UA: 81L
👉East: 21L
👉West: 15L
👉Guntur: 16L
👉Krishna: 15L
👉Nellore: 10L
AP-TG Total:- 3.41CR(6.60CR~ Gross)
👉Ka+ROI: 0.05Cr
👉OS – 0.10Cr
Total WW: 3.63CR(7CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… 25 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ను 11 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ కి అమ్మగా 11.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 7.87 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here