మంచి స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేక పోతున్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు… సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగ్రౌండ్ లో ఉన్నప్పటికీ కూడా సుధీర్ బాబు ఆశించిన సక్సెస్ ను అందుకోలేక పోతున్నాడు. సినిమా కోసం బాడీ ని ఎంత కష్టపడి పెంచినా కానీ లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం లోనే చేతులు ఎత్తేసింది…
సినిమా మొదటి వీకెండ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా కానీ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా ట్రాక్ తప్పింది సినిమా. ఒకపక్క హీరో అన్ని చోట్లా తిరిగి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నా కానీ ఎందుకనో ఆ ప్రమోషన్స్ కలెక్షన్స్ రూపంలో మారలేదు.
మొత్తం మీద మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సినిమా బ్రేక్ ఈవెన్ లో సగం లోపే రికవరీ చేయడం విచారకరం అని చెప్పాలి. సినిమా 5 వ రోజు 23 లక్షలు, 6 వ రోజు 16 లక్షలు, 7 వ రోజు 13 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది..
మొత్తం మీద మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.38Cr
👉Ceeded: 66L
👉UA: 54L
👉East: 36L
👉West: 20L
👉Guntur: 40L
👉Krishna: 22L
👉Nellore: 11L
AP-TG Total:- 3.87CR(6.35Cr Gross)
KA+ROI: 10L
OS: 23L~
Total Collections: 4.20CR(7.20CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
సినిమాను ఓన్ రిలీజ్ కాకుండా మిగిలిన చోట్ల మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 8.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 4.3 కోట్ల రేంజ్ షేర్ ని ఇంకా సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. రెండో వారం కూడా బాగానే థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా ఎంతవరకు లాస్ ని తగ్గించుకుంటుందో చూడాలి ఇప్పుడు.