బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ స్టార్టింగ్ లో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను ఎపిక్ హిట్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bhola Shankar) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా…
రాగా ప్రీమియర్స్ తో 3 లక్షల డాలర్స్ ను మాత్రమే అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరంగా కంబ్యాక్ తర్వాత చేసిన సినిమాల్లో ఆల్ మోస్ట్ గాడ్ ఫాదర్ రేంజ్ బుకింగ్స్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది…మొదటి రోజు మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ బోర్డులు పడినా…
తర్వాత అవి కొన్ని సెంటర్స్ కే పరిమితం అవ్వగా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా బుకింగ్స్ కొన్ని చోట్ల గాడ్ ఫాదర్ కన్నా బెటర్ గా ఎక్కువ చోట్ల గాడ్ ఫాదర్ కి సిమిలర్ గా ఉండటం ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా సినిమా అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయలేకపోయింది..
దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 14-15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే కనుక 16 కోట్లు ఆ పైన వసూల్ చేసే అవకాశం ఉంది…
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19-20 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే సాధ్యం అని చెప్పాలి. మరి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా భారీ గ్రోత్ తో సినిమా ఈ అంచనాలను మించుతుందో లేక ఇదే రేంజ్ లో వసూల్ చేస్తుందో చూడాలి ఇక…