Home న్యూస్ 1st డే డంకి కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి!

1st డే డంకి కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రెండు బాక్ టు బాక్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ఓపెనింగ్స్ ని అందుకుని సంచలనం సృష్టించిన బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఆ సినిమాలతో 1000 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని సంచలన విజయాలను అందుకున్న తర్వాత ఇప్పుడు ఏకంగా…

బాలీవుడ్ నంబర్1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాకి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది… కానీ కలెక్షన్స్ పరంగా 2 ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన హీరో నుండి అలాగే…

బాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ కాంబో మూవీ రేంజ్ లో అయితే ఈ ఓపెనింగ్స్ లేవనే చెప్పాలి. సినిమా మొదటి రోజు ఇండియాలో అన్ని చోట్ల కలిపి 26-28 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు కనుక బాగుంటే…

30 కోట్ల రేంజ్ లో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని సాధించవచ్చు. ఇక ఓవర్సీస్ లో 3.5 మిలియన్ నుండి 4 మిలియన్ డాలర్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 65 కోట్ల నుండి 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది…

కానీ ముందే చెప్పినట్లు ఈ కాంబో మీద ఉన్న అంచనాలకు తగ్గ ఓపెనింగ్స్ అయితే ఇవి కావనే చెప్పాలి. కానీ రాజ్ కుమార్ హిరాని సినిమాలకు లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి. ఇక అఫీషియల్ 1 ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here