Home న్యూస్ గామి 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…..హౌస్ ఫుల్స్ తో మాస్ జాతర!

గామి 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…..హౌస్ ఫుల్స్ తో మాస్ జాతర!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie 1st Day Box Office Collections Update)….రీసెంట్ గా రిలీజ్ అయ్యి చూసిన ఆడియన్స్ కి సినిమా ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని కలిగించింది…. దాంతో ఓవరాల్ గా డీసెంట్ టు గుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా….

బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం, సినిమా మొదటి రోజు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే $150K మార్క్ ని దాటేయగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా మంచి ట్రెండ్ కనిపిస్తూ ఉంది, ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లాస్ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో దూసుకు పోతూ ఉండగా….

చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం, అదే టైంలో మాస్ సెంటర్స్ లో జస్ట్ ఓకే అనిపించే రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకోగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో బుకింగ్స్ చూస్తూ ఉంటే మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.3-1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా….

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.6 కోట్ల రేంజ్ నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల దాకా వెళ్ళొచ్చు, ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…

సినిమా మాస్ జాతర అనిపించే రేంజ్ లో దుమ్ము లేపబోతుందని చెప్పాలి…. ఇక మొత్తం మీద ఇదే జోరుని వీకెండ్ లో సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉండగా మొదటి రోజు సినిమా అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటుందో లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here