Home న్యూస్ డే 1 కల్కి AP-TG బిగ్గెస్ట్ టార్గెట్స్ ఇవే…రెబల్ స్టార్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!!

డే 1 కల్కి AP-TG బిగ్గెస్ట్ టార్గెట్స్ ఇవే…రెబల్ స్టార్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!!

0

సమ్మర్ మొత్తం చాలా చప్పగా సాగిన తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వేడి ఎక్కబోతుంది….పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా….

భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది….అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ సాలిడ్ గా సాగుతూ ఉండగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది ఇప్పుడు….ఇక తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ లో ఇది వరకు భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న…

బిగ్ మూవీస్ లో కల్కి మూవీ ఇప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది, ఎలాంటి రికార్డులు అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…

   

ఒకసారి తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఇది వరకు ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…. 
AP TG 1st Day Highest Share Movies
1. #RRRMovie – 74.11CR
2. #SALAAR- 50.49CR
3. #Baahubali2- 43CR
4. #GunturKaaram – 38.88CR
5. #SyeRaa – 38.75Cr

ప్రస్తుతం కల్కి ఊపు చూస్తూ ఉంటే మొదటి రోజు సలార్ కి ఆర్ ఆర్ ఆర్ సినిమాకి మధ్య లో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమలో అనుకున్న రేంజ్ లో ఓపెన్ అయితే మట్టుకు మరింత జోరు చూపించవచ్చు. ఇక సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here