Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

ఆపరేషన్ వాలెంటైన్ 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine 1st Day Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మరీ అనుకున్న రేంజ్ లో టాక్ అయితే సొంతం అవ్వలేదు… యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా కూడా మరీ జోరు ఏమి చూపించలేదు… ఓవరాల్ గా అడ్వాన్స్ టికెట్ సేల్స్ గ్రాస్ 80 లక్షల దాకా తెలుగు రాష్ట్రాలలో ఉండగా వరల్డ్ వైడ్ గా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మాస్ సెంటర్స్ లో సినిమా…

పెద్దగా ఇంపాక్ట్ ఏమి కనిపించలేదు అనే చెప్పాలి. అదే టైంలో మల్టీ ప్లెక్సులలో సినిమా పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను అందుకోగా ఓవరాల్ గా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

వరల్డ్ వైడ్ గా సినిమా 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది, అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అని చెప్పాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here