Home న్యూస్ 24 గంటలు ఓవర్….గామి ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్….గామి ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో ఆడియన్స్ ముందుకు మార్చ్ 8న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు….

ట్రైలర్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఈ రేంజ్ క్వాలిటీ ఏంటి సామి…ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ఉందని మెచ్చుకుంటూ ఉండగా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారబోతుంది అని చెప్పాలి. ఓవర్ నైట్ లో సినిమా కి క్రేజ్ ఏర్పడగా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను సాలిడ్ గా పెంచింది.

ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పొచ్చు. వ్యూస్ పరంగా ఎలాంటి యాడ్స్ లాంటివి లేకుండా ఆర్గానిక్ గా 3.02 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న సినిమా ట్రైలర్ లైక్స్ పరంగా ఓవరాల్ గా 162.5K లైక్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది…

వ్యూస్ పర్వాలేదు అనిపించేలా ఉండగా లైక్స్ మాత్రం ఎక్స్ లెంట్ గా సొంతం అయ్యి మంచి రీచ్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ట్రైలర్ కి వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ సినిమా కి వస్తే ఇక విశ్వక్ సేన్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here