బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి(Baahubali) సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తర్వాత చేసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం కుమ్మేస్తూ దూసుకు పోతున్నాడు. ఒక్క రాధే శ్యామ్ సినిమా క్లాస్ జానర్ అవ్వడంతో…
అంచనాలను అందుకునే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోలేదు… కానీ మిగిలిన సినిమాలు అన్నీ కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్న సలార్(Salaar) మూవీతో ఎలాంటి ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టిస్తాడు అన్నది ఆసక్తిగా మారగా ఒకసారి ప్రభాస్ నటించిన…
రీసెంట్ మూవీస్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
#Prabhas Recent Movies 1st Day Telugu States Shares
👉#AdiPurush – 32.84CR
👉#RadheShyam – 25.49CR
👉#Saaho – 36.52CR
👉#Baahubali2 – 43CR
👉#Baahubali – 22.40CR
ఇప్పుడు భారీ అంచనాల నడుమ టికెట్ హైక్స్, ఎక్స్ ట్రా షోల అడ్వాంటేజ్ తో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీ కచ్చితంగా సంచలన ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా సలార్ మొదటి రోజు ఓవరాల్ గా ఉన్న క్రేజ్ అండ్ బజ్ దృశ్యా చూసుకుంటే 35 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది…..
ఒకవేళ సినిమా అంచనాలను మించి ఆకట్టుకుంటే ఈ కలెక్షన్స్ లెక్క షో షోకి పెరిగి పోయి మొదటి రోజు సంచలన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. సినిమా ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వసూళ్ళని అందుకుంటుందో చూడాలి ఇక…