బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది, మిగిలిన సినిమాల కన్నా ఎక్కువ థియేటర్స్ ని సొంతం చేసుకున్నా కానీ బజ్ ప్రకారం చాలా లో బజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఈవినింగ్ షోలతో మంచి గ్రోత్ ని చూపించి మిగిలిన సినిమాల కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
సినిమా మొత్తం మీద మొదటి రోజు నైజాంలో 40 లక్షల షేర్ ని సీడెడ్ లో 10 లక్షల షేర్ ని అందుకోగా ఆంధ్రలో 45 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 95 లక్షల షేర్ ని 1.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
తెలుగు లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.50 కోట్లు కాగా ఆ మార్క్ కి సినిమా ఇంకా 4.55 కోట్ల షేర్ దూరంలో ఉంది, ఇక సినిమా తమిళనాడులో ఫస్ట్ డే 3.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా 7 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను…
సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రెండో రోజు మిగిలిన సినిమాల మీద ఎంత లీడ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.