Home న్యూస్ 1st డే టైగర్ 3 టోటల్ కలెక్షన్స్…..సల్మాన్ ఖాన్ మాస్ జాతర!

1st డే టైగర్ 3 టోటల్ కలెక్షన్స్…..సల్మాన్ ఖాన్ మాస్ జాతర!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger3 Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మరీ అనుకున్న రేంజ్ లో టాక్ సొంతం అవ్వక పోయినా ప్రీ దీపావళి ఇంపాక్ట్ కూడా ఉన్నప్పటికీ ఓవరాల్ గా బాలీవుడ్ లో దీపావళి టైంలో…

రిలీజ్ అయిన మూవీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఈ సినిమా దుమ్ము దుమారం లేపింది. మొదటి రోజు 38-40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా సినిమా ఆ మార్క్ ని దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు మొదటి రోజున…

ఏకంగా 43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక డబ్బింగ్ వర్షన్ ల కలెక్షన్స్ 1.50 కోట్ల దాకా ఉండగా ఓవరాల్ గా అన్నీ కలుపుకుని మొదటి రోజున సినిమా 44.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఓవర్సీస్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకున్న సినిమా 5 మిలియన్ డాలర్స్ దాకా గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 95-96 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం. సినిమా పఠాన్(Pathaan) మరియు జవాన్(Jawan Movie) రేంజ్ లో కనుక ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటే మొదటి రోజు…

బాలీవుడ్ లో రికార్డులు నమోదు అయ్యి ఉండేవి, ఓవరాల్ గా ప్రీ దీపావళి ఇంపాక్ట్ ఉన్నా కూడా సల్మాన్ ఖాన్ ఊచకోత కోయగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెట్టించిన జోరు చూపించి సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here