బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square 1st Day Collections) సినిమా భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రాగా వరల్డ్ వైడ్ గా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మంచి జోరుని చూపించింది.
హైదరాబాదులో 2 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా రిలీజ్ రోజున షో షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉంది… ఇక ఓవర్సీస్ లో ప్రీమియ్ర్స్ తోనే ఆల్ మోస్ట్ 475K మార్క్ డాలర్స్ ను దాటేసిన సినిమా రిమార్కబుల్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా షో షోకి జోరు చూపిస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 3.5-4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా నైట్ షోలకి సినిమా IPL మ్యాచ్ నుండి పెద్దగా ఇంపాక్ట్ లేకుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….
అదే కనుక జరిగితే సినిమా 4.5-5 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొదటి పార్ట్ ఎక్స్ లెంట్ రీచ్ రెండో పార్ట్ సూపర్ పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సమ్మర్ అడ్వాంటేజ్ లభించడంతో టిల్లు స్క్వేర్ మూవీ మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….
లాస్ట్ 2 నెలలుగా టాలీవుడ్ లో ఇలాంటి మంచి బజ్ ఉన్న మూవీకి పాజిటివ్ టాక్ సొంతం అవ్వలేదు, కానీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి ఇవన్నీ సొంతం అవ్వడం సమ్మర్ అడ్వాంటేజ్ ఉండటంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఇక డే 1 ఎంతవరకు అంచనాలను సినిమా మించుతుందో చూడాలి.