Home న్యూస్ 1st డే టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్….మెంటల్ మాస్ జాతర ఇది!!

1st డే టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్….మెంటల్ మాస్ జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దుమారం లేపి అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో..

అంచనాలను అన్నీ కూడా మించి పోయింది. సినిమా 6-7 కోట్ల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకున్నా కూడా సినిమా వర్త్ షేర్ పరంగా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా GST రిటర్న్స్ తో కలిపి సినిమా ఓవరాల్ గా 9.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుంది…

అందులో ఆల్ మోస్ట్ సగం వరకు కలెక్షన్స్ ని నైజాం ఏరియా నుండే సొంతం చేసుకుంది… సినిమా నైజాంలో 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మిగిలిన ఏరియాల్లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Tillu Square 1st Day Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 4.35Cr
👉Ceeded: 1.04Cr
👉UA: 1.24Cr
👉East: 75L
👉West: 43L
👉Guntur: 56L
👉Krishna: 49L
👉Nellore: 39L
AP-TG Total:- 9.25CR (13.45CR~ Gross)
👉KA+ROI: 0.45Cr
👉OS: 4.60Cr
Total WW:- 14.30CR(23.70CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజే ఆల్ మోస్ట్ 50% కి పైగా రికవరీని సొంతం చేసుకుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరో 13.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here