Home గాసిప్స్ 2 బ్లాక్ బస్టర్స్ కొట్టిన డైరెక్టర్…ఇప్పుడు అసిస్టంట్ డైరెక్టర్ గా మారబోతున్నాడు!

2 బ్లాక్ బస్టర్స్ కొట్టిన డైరెక్టర్…ఇప్పుడు అసిస్టంట్ డైరెక్టర్ గా మారబోతున్నాడు!

0

సాదారణంగా ఏ డైరెక్టర్ అయినా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తాడు, ఒక్కసారి హిట్ సొంతం అయితే చాలు ఇక వరుస పెట్టి కాంబినేషన్ లు సెట్ చేసుకుని కెరీర్ ని ఇంకా బాగా బిల్డ్ చేసుకోవాలని చూస్తారు, కానీ ఒక యంగ్ డైరెక్టర్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లను కెరీర్ లో మొదటి రెండు సినిమాల డైరెక్షన్ లోనే సొంతం చేసుకున్నా కానీ…

ఇప్పుడు మరో డైరెక్టర్ మూవీ కి అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేయబోతున్నారన్న వార్తా టాలీవుడ్ లో గట్టిగా చక్కర్లు కొడుతుంది, ఆ డైరెక్టర్ మరెవరో కాదు, టాలీవుడ్ లో ఛలో మరియు భీష్మ సినిమాలతో ఓ రేంజ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి…

రెండు సినిమాలతో సాలిడ్ బ్లాక్ బస్టర్ లను దక్కించుకుని సత్తా చాటుకున్న వెంకీ కొడుముల… తొలి 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టిన ఈ డైరెక్టర్ సడెన్ గా ఇప్పుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ల హాట్రిక్ మూవీ కి గాను…

త్రివిక్రమ్ స్పెషల్ రిక్వెస్ట్ మేరకు అసిస్టంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారట. కెరీర్ ని త్రివిక్రమ్ దగ్గర అసిస్టంట్ డైరెక్టర్ గానే మొదలు పెట్టిన వెంకీ ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కి తన వంతు హెల్ప్ చేయబోతున్నారని తెలుస్తుంది. కానీ రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఇలా మళ్ళీ అసిస్టంట్ డైరెక్టర్ గా చేయడం అన్నది…

బహుశా ఇప్పటి వరకు జరిగి ఉండదు అనే చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ విషయం లో ఫుల్ సీరియస్ గా ఉన్నారని, మహేష్ తో ఈ సారి కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టాలి అన్న కసితో ఉన్నారని తెలుస్తుంది, మరి ఈ విషయం లో వెంకీ త్రివిక్రమ్ కి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో అన్నది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here