యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో లో వచ్చిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓవరాల్ గా 37 కోట్లకు పైగా షేర్ ని 57 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా సినిమా రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 8.01 కోట్ల షేర్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ టోటల్ కలిసి సుమారు 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నట్లు సమాచారం… దాంతో రెండో రోజు మొత్తం మీద గ్రాస్ లెక్క 18 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం.
దాంతో రెండు రోజుల్లో సినిమా ఓవరాల్ గ్రాస్ లెక్క 75 కోట్లకి పైగా ఉండటం ఖాయం అయింది… ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఫాస్టెస్ట్ 75 కోట్ల గ్రాస్ మూవీగా చెప్పుకోవచ్చు. అలాగే టాలివుడ్ లో కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 75 కోట్ల గ్రాస్ మార్క్ తో సంచలనం సృష్టించింది ఈ సినిమా..