Home టోటల్ కలెక్షన్స్ విజయ్ సేతుపతి కలెక్షన్స్: టార్గెట్ 1.4 కోట్లు…వచ్చింది ఇది…పాపం!!

విజయ్ సేతుపతి కలెక్షన్స్: టార్గెట్ 1.4 కోట్లు…వచ్చింది ఇది…పాపం!!

0

     కోలివుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. తెలుగు లో సైరా సినిమా లో స్పెషల్ రోల్ తో ఇక్కడ కూడా మంచి గుర్తుంపు ని సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ సంగా తమిళన్ సినిమా ను తెలుగు లో డైరెక్ట్ గా విజయ్ సేతుపతి పేరునే టైటిల్ గా మార్చి రిలీజ్ చేశారు. కాగా సినిమా చాలా లిమిటెడ్ గా రిలీజ్ అవ్వగా…

రిలీజ్ అయిన మొదటి షో కే సినిమా కి ఇక్కడ ఫ్లాఫ్ టాక్ లభించింది, తర్వాత ఏ దశలో కూడా కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది ఈ సినిమా. ఇక సినిమా రిలీజ్ 300 స్క్రీన్స్ లో ఇక్కడ రిలీజ్ అవ్వగా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ మొత్తం మీద….

1.1 కోట్ల రేంజ్ లో జరిగింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో హిట్ అవ్వాలి అంటే సినిమా మినిమం 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు 16 లక్షల షేర్ ని వీకెండ్ అయ్యే సరికి 30 లక్షల షేర్ ని అందుకున్న సినిమా..

టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 53 లక్షల షేర్ ని మాత్రమె రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగలిగింది, ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో అసలు ప్రమోషన్స్ లేక పోయినా కానీ ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి కానీ ఓవరాల్ గా బిజినెస్ దృశ్యా చూసుకుంటే సినిమా కి నష్టం గట్టిగానే వచ్చింది.

1.1 బిజినెస్ కి 53 లక్షల షేర్ అందుకున్న సినిమా టోటల్ గా 58 లక్షల లాస్ ని సొంతం చేసుకుని డిసాస్టర్ అయ్యింది, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఓవరాల్ కలెక్షన్స్ ప్రమోషన్స్ లేకున్నా బాగానే రావడం తో విజయ్ సేతుపతి నటించిన ఇతర సినిమాలను ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు టాలీవుడ్ నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here