రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ 2 ఏళ్ల కి సంపూర్నేష్ బాబు నటించిన కొత్త సినిమా బజార్ రౌడీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను ఆల్ మోస్ట్ 300 వరకు థియేటర్స్ లో….
గ్రాండ్ గా రిలీజ్ చేశారు….కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాల నుండి పోటి కూడా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో అసలే థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక చాలా తక్కువ సంఖ్యలో సినిమాలను…
చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తుంటే… ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడం తో అసలు ఏ సినిమాకి వెళ్ళకుండా ఉంటున్నారు జనాలు, ఈ సినిమా విషయంలో అదే జరిగి థియేటర్స్ లో జనాలు లేక చాలా చోట్ల మొదటి రోజు షోలు అసలు పడనే లేదని చెప్పాలి.
ఇక పడిన చోట్ల కూడా పెద్దగా జనాలు లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ రోజే డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 16 లక్షల గ్రాస్ ని వసూల్ చేయగా రెండో రోజు 6 లక్షల దాకా గ్రాస్ ని సాధించింది. రెండు రోజుల్లో 22 లక్షల దాకా గ్రాస్ ని…
13 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసేస్తే 6-7 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించినట్లు అవుతుంది. ఈ రేంజ్లో దెబ్బ పడటం అది కూడా 300 థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాకి అంటే జనాలు సినిమాల విషయంలో ఎంత ఆచితూచి అడుగులు వేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.