యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… సినిమా తెలుగు రాష్ట్రాలలో తొలిరోజు డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా రెండో రోజు ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… మొత్తం మీద సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో…
35 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి… ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో రోజు సినిమా 40 లక్షల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
తెలుగు రాష్ట్రాలలో 97 లక్షల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల దాకా షేర్ ని అందుకుందని అంచనా వేస్తున్నారు. టోటల్ గ్రాస్ లెక్క 1.8 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్ల దాకా ఉన్న నేపధ్యంలో సినిమా ఇంకా బాగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అన్ని సినిమాల పై అన్ సీజన్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉందని చెప్పాలి.