బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ ఇయర్ ఎన్నో సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. వాటిలో ప్రతీ నెలలో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, పండగలు ఉన్న నెలల్లో ఇంకా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే అన్ సీజన్ అనిపించిన నెలల్లో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ మూవీస్ పరంగా ఫిబ్రవరి మరియు నవంబర్ లాంటి నెలలను ఎక్కువగా అన్ సీజన్ అని భావిస్తారు…
ఈ నెలల్లో సినిమాల రిలీజ్ లు చాలా తక్కువగా ఉంటే స్టార్స్ నటించిన సినిమాల రిలీజ్ లు మరింత తక్కువ ఉంటాయి అని చెప్పాలి. 2013 లో వచ్చిన మిర్చి సినిమా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తర్వాత ఫిబ్రవరి నెలలో…
అనేక సినిమాలు రిలీజ్ అయినా కానీ ఏవి కూడా మిర్చి సినిమా నెలకొల్పిన కలెక్షన్స్ ని బ్రేక్ చేయలేదు, ఇక ఎట్టకేలకు లాస్ట్ ఇయర్ ఉప్పెన సినిమా చిన్న సినిమానే అయినా భారీ అంచనాలను క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మిర్చి కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా….
ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నిలిచింది, ఇప్పుడు ఉప్పెన నెలకొల్పిన రికార్డ్ కలెక్షన్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి అన్ సీజన్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా కేవలం 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఉప్పెన సినిమా…
ఫిబ్రవరి నెల హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది… బాక్స్ ఆఫీస్ ఇప్పుడు భీమ్లా నాయక్ నెలకొల్పిన ఫిబ్రవరి రికార్డ్ మార్జిన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఆశాగా ఎదురు చూస్తున్నారు… అప్ కమింగ్ ఇయర్స్ లో ఫిబ్రవరి నెలలో భీమ్లా కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం కొంచం కష్టమే అని చెప్పాలి.