కెరీర్ మొదలు పెట్టడం హీరోగా మొదలు పెట్టినా కానీ కావలసినంత పేరు క్రేజ్ మాత్రం విలన్ గా చేసిన సినిమాలతోనే సొంతం చేసుకున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్, కెరీర్ మొదట్లోనే విలన్ గా జయం, నిజం మరియు వర్షం లాంటి సినిమాలలో విలన్ గా చేసి ఓ రేంజ్ లో పేరుని సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత కూడా విలన్ గానే చేస్తాడేమో అనుకున్నారు అందరూ, కానీ సడెన్ గా ఓ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుని గోపీచంద్ కి తిరిగి హీరోగా మంచి ఫ్యూచర్ ఉందని రుజువు చేసింది, ఆ సినిమానే యజ్ఞం మూవీ…. 2004 టైం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది…
ఈ సినిమాతో ఇక హీరోగా వెనుతిరిగి చూసుకోకుండా వరుస ఆఫర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు గోపీచంద్… కానీ ఈ సినిమా గోపీచంద్ కన్నా ముందు మరో ఇద్దరు హీరోల దగ్గరకు వెళ్ళింది, వాళ్ళు నో చెప్పడంతో గోపీచంద్ కి ఈ బ్లాక్ బస్టర్ మూవీ సొంతం అయ్యింది అని చెప్పాలి.
ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కళ్యాణ్ రామ్ లు…. ఈ ఇద్దరి దగ్గరకు ఈ సినిమా కథ ముందుగా వెళ్ళగా ఇద్దరి కెరీర్ అప్పుడప్పుడే స్టార్ట్ అవ్వడంతో కొత్త దర్శకుడితో కాకుండా వేరే డైరెక్టర్ తో అయితే బాగుంటుందని ఈ సినిమాను కి నో చెప్పారట. తర్వాత అనుకోకుండా ఈ కథ గోపీచంద్ దగ్గరకు వెళ్లిందంట… కథ నచ్చిన గోపీచంద్…
కొత్త దర్శకుడు అని ఏమి పట్టించుకోకుండా ఈ సినిమా చేయడం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగింది, తర్వాత గోపీచంద్ వరుసగా యాక్షన్ మూవీస్ తో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. కానీ రీసెంట్ టైం లో సరైన హిట్ గోపీచంద్ కి సొంతం అవ్వలేదు అనే చెప్పాలి.