ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే చాలా చిన్న ఇండస్ట్రీగా పేరున్న ఇండస్ట్రీ అయిన మలయాళ ఇండస్ట్రీ నుండి అడపాదడపా కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా కానీ ఇతర ఇండస్ట్రీల మాదిరిగా సాలిడ్ గా గ్రోత్ అయితే సొంతం అవ్వలేదు. అప్పుడెప్పుడో వచ్చిన మోహన్ లాల్ పులి మురుగన్ మూవీ అలాగే లూసిఫర్ సినిమాల కలెక్షన్స్ రికార్డులు ఇప్పటికీ కొనసాగాయి. ముఖ్యంగా పులి మురుగన్ సినిమా…
2016 టైంలో మలయాళ ఇండస్ట్రీ మార్కెట్ కి మించి భారీ వసూళ్ళని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా కలెక్షన్స్ ని తర్వాత ఏ మలయాళ మూవీ కూడా అందుకోలేక పోయింది. సినిమా రిలీ అయ్యి 7 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ రికార్డ్ అలాగే ఉండగా…
ఎట్టకేలకు ఇప్పుడు పులి మురుగన్ సినిమా ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ ని ఎవ్వరూ ఊహించని 2018 అనే సినిమా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఈ 7 ఏళ్లలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కొన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయినా కూడా ఈ సినిమా కూడా పులి మురుగన్ ని అందుకోలేక పోయింది.
కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 2018 మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 140 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని లాంగ్ రన్ లో 175 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇతర వర్షన్స్ కూడా క్లిక్ అయితే 200 కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.