Home న్యూస్ 204 కోట్ల ఇండస్ట్రీ హిట్…అయినా ఇంకా 26CR కొడితేనే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది!

204 కోట్ల ఇండస్ట్రీ హిట్…అయినా ఇంకా 26CR కొడితేనే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది!

0

ఇండస్ట్రీ హిట్ మూవీ అంటే అన్ని చోట్లా ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ రికార్డులను నమోదు చేసిన సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేస్తే ఆ సినిమా నికార్సయిన ఇండస్ట్రీ హిట్ గా చెప్పొచ్చు, కానీ అన్ని సినిమాలకు ఇది సాధ్యం అవ్వదు, కొన్ని సినిమాలు కొన్ని చోట్ల అంచనాలను మించి….

వసూళ్ళని సాధించి ఓవరాల్ కలెక్షన్స్ తో పాత ఇండస్ట్రీ హిట్ మూవీని బీట్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తాయి….రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) సినిమా విషయంలో ఇదే జరిగింది… పాత ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచిన….

2018 మూవీ సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 178 కోట్లను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఇప్పటి వరకు 204 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుని భారీ లీడ్ తో కొత్త ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది, కానీ అదే టైంలో సొంత గడ్డ అయిన కేరళలో మాత్రం ఈ సినిమా ఇంకా…

పాత ఇండస్ట్రీ హిట్ అయిన 2018 కన్నా చాలా వెనకబడే ఉంది. 2018 మూవీ టోటల్ రన్ లో 89.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే మంజుమ్మేల్ బాయ్స్ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 63.20 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. తమిళ్ లో ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు రావడంతో ఓవరాల్ గా ఇండస్ట్రీ హిట్ గా…

ఈ సినిమా నిలిచినప్పటికీ కూడా ఇంకా కేరళలో ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అంటే మాత్రం సినిమా మరో 26 కోట్ల గ్రాస్ వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ప్రస్తుతం రన్ స్లో డౌన్ అవ్వడంతో ఇక ఈ మార్క్ ని ఇక్కడ అందుకోవడం కష్టమే అంటున్నారు. దాంతో ఓవరాల్ ఇండస్ట్రీ హిట్ అయినా కూడా కేరళలో మాత్రం 2018 ఇండస్ట్రీ హిట్ గా కొనసాగే అవకాశమే చాలా ఎక్కువ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here