బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 2018 మూవీ ఎక్స్ లెంట్ గా జోరుని చూపిస్తూ దుమ్ము లేపగా సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా ఊరమాస్ వసూళ్ళని అందుకుంటూ వర్కింగ్ డేస్ లో కూడా సూపర్బ్ గా జోరు చూపిస్తూ ఉండటం విశేషం. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ వరకు సూపర్బ్ జోరుని చూపించిన సినిమాకి…
ఇప్పుడు సడెన్ గా మలయాళంలో అలాగే ఇతర చోట్ల డ్రాప్స్ చాలా ఎక్కువగా అయ్యాయి. సినిమా 25 రోజులను పూర్తీ చేసుకుని 165 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా లాంగ్ రన్ లో 200 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతుంది అనుకున్నా కానీ…
టీం సడెన్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ఈ నెల 7న సోని లివ్ లో ఉండబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తగ్గు ముఖం పట్టాయి ఇప్పుడు. వీకెండ్ తర్వాత నుండి ఇప్పటి వరకు సినిమా కోటి లోపే గ్రాస్ ను వసూల్ చేసింది.
తెలుగు లో కొంచం బాగానే హోల్డ్ చేసినా ఎక్స్ లెంట్ గా ఇప్పటికీ జోరు చూపించిన మలయాళ వర్షన్ లేటెస్ట్ గా డిజిటల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వలన స్లో డౌన్ అవ్వడంతో సినిమా లాంగ్ రన్ లో ఇక 200 కోట్ల మార్క్ ని అందుకోవడం అసాధ్యం అనే అంటున్నారు… లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకోగలుగుతుందో చూడాలి ఇక.