Home న్యూస్ 2018 టాలీవుడ్ బెస్ట్ హీరో ఎవరంటే??

2018 టాలీవుడ్ బెస్ట్ హీరో ఎవరంటే??

97

       2018 ఇయర్ ఆల్ మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది. మన హీరోల బెస్ట్ పెర్ఫార్మెన్స్ లు కొన్ని ఈ ఇయర్ సినిమాలకు అల్టిమేట్ హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి. కొన్ని సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా హీరోల పెర్ఫార్మెన్స్ ని మాత్రం మంచి పేరు దక్కింది. మరి టోటల్ గా ఇయర్ ఎండింగ్ లో ఇప్పటి వరకు వచ్చిన టోటల్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్ గా ఎవరు నిలిచారో తెలుసు కుందాం పదండీ…

ముందుగా ఇయర్ స్టార్టింగ్ లో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చి అప్పటి వరకు కొన్ని సార్లు నటన విషయం లో నెగటివ్ మార్కులు వేసుకున్నా కానీ ఒక్క సినిమా తో లెక్కలు అన్ని సెట్ చేసి ఒక్క వంక పెట్టకుండా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ రేసులో ముందు నిలిచాడు.

తర్వాత మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా విషయం లో మరోసారి సటిల్ద్ పెర్ఫార్మెన్స్ తో సిఎమ్ గా హుందా గా నటించాడు. కానీ ఒకప్పటి పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలలో ఉన్న ఇంటెన్సిటీ ఈ మధ్య మిస్ అవ్వడం కొంత నిరాశని కలిగించినా భరత్ అనే నేను కి ఎంత అవసరమో అంతే చేసి మెప్పించాడు మహేష్.

ఇక సమ్మర్ లో నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో అనుకున్న రేంజ్ విజయాన్ని సొంతం చేసుకోకున్నా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మెప్పించాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు…అందుకే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రేసులో నిలిచాడు అల్లుఅర్జున్.

ఇక సెకెండ్ ఆఫ్ లో గీత గోవిందం సినిమాతో అమాయక మైన అబ్బాయి రోల్ లో ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ మనసును గెలిచాడు విజయ్ దేవరకొండ. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అర్జున్ రెడ్డి లో ఇచ్చినా పూర్తీ ట్రాన్స్ ఫార్మేషన్ రోల్ లో ఇందులో కూడా మెప్పించాడు.

ఇక అరవింద సమేత సినిమా లో కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మొదటి 10 నిమిషాల్లోనే తండ్రి చనిపోతే ఆ భాధని సినిమా మొత్తం క్యారీ చేయడం, కళ్ళలో ఆ ఇంటన్సీ ని మెయిన్ టైన్ చేయడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది అని చెప్పాలి.

ఇవి కాక ఈ ఇయర్ లో గూఢచారి లో అడవి శేష్, RX100 లో కార్తికేయ, కృష్ణార్జున యుద్ధం లో నాని మరికొన్ని పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకున్నా టోటల్ ఇయర్ లో పైన చెప్పిన టాప్ 5 హీరోలు బెస్ట్ ఇచ్చారు అని చెప్పాలి. మరి వీళ్ళలో ఈ ఇయర్ బెస్ట్ ఎవరు అంటే మాత్రం చెప్పడం కష్టమే.

కానీ అప్పటి వరకు కొన్ని విమర్శలను ఎదురుకుని కూడా కొత్త సినిమాతో ఒక్క వంక పెట్టని పెర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాన మోసి మెప్పించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మా దృష్టి లో ఈ ఇయర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. మరి మీ బెస్ట్ హీరో ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

97 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here