Home న్యూస్ డే 3 (5 మూవీస్) కలెక్షన్స్..KGF దెబ్బ అదుర్స్!

డే 3 (5 మూవీస్) కలెక్షన్స్..KGF దెబ్బ అదుర్స్!

0

      బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన 5 సినిమాలు తొలి రెండు రోజుల్లో అంచనాలను పూర్తీ గా అందుకోలేక పోయాయి… ఒక్క KGF మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లీడ్ తీసుకుని కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండగా మిగిలిన సినిమాలు మాత్రం పడుతూ లేస్తూ కలెక్షన్స్ ని అందుకుంటూ రేసు లో స్లో అండ్ స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటూ ఆదివారం కలెక్షన్స్ రేసు లో ఎంటర్ అవ్వగా,

ముందుగా అంతరిక్షం సినిమా మూడో రోజు ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సినిమా కలెక్షన్స్ 60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఏమాత్రం బిజినెస్ కి తగ్గ కలేక్షస్న్ కావు.

ఇక పడిపడిలేచే మనసు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా స్లో డౌన్ అయింది. రెండో రోజు లెవల్ లోనే మూడో రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందని సమచారం.

ఇక KGF బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు లీడ్ ని సాధించి జోరు చూపగా మూడో రోజు కూడా హిందీ తెలుగు గ్రోత్ అల్టిమేట్ లెవల్ లో ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా మూడో రోజు కలెక్షన్స్ 1 కోటి రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇక ధనుష్ నటించిన మారి 2 తెలుగు లో మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని అందుకోవడం లేదు. సినిమా మూడో రోజు కూడా మరోసారి 30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక షారుఖ్ ఖాన్ నటించిన జీరో బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ గ్రోత్ ని మరీ లో కలెక్షన్స్ ని అందుకో లేక పోయింది. మూడో రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 18 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పాలి.

మొత్తం మీద 5 సినిమాలు వీకెండ్ లో భారీ వసూళ్లు రెండు రాష్ట్రాలలో సాధిస్తాయి అని అనుకున్నా టోటల్ మూవీస్ కలెక్షన్స్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఉన్నంతలో KGF సినిమా మాత్రం అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here