Home న్యూస్ 2018 టాలీవుడ్ బెస్ట్ మూవీ

2018 టాలీవుడ్ బెస్ట్ మూవీ

31

        2018 ఇయర్ ఆల్ మోస్ట్ ముగింపు దశకి వచ్చేసింది. ఒక్కసారి ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మొత్తం సినిమాలను చూసుకుంటే కొన్ని అంచనాలను అందుకున్నాయి. కొన్ని అంచనాలు మించాయి.. చాలా సినిమాలు అంచనాలను అందుకోలేక బోల్తా పడ్డాయి. టోటల్ గా కొన్ని సినిమాలు ఈ ఏడాది టాలీవుడ్ లో బెస్ట్ అనిపించుకోగా వాటి మొత్తం మీద ఈ ఇయర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమా ఎదో తెలుసుకుందాం పదండీ..

ముందుగా ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన రంగస్థలం సినిమా క్లాస్ ని మాస్ ని, యూత్ ని ఓవర్సీస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుని ఆల్ టైం రికార్డులతో అల్టిమేట్ రిపీట్ వాల్యూ తో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఇయర్ లో బెస్ట్ మూవీ పరంగా అన్నిటికంటే ముందు నిలిచింది.

ఇక తర్వాత మహేష్ కొరటాల శివ ల కాంబో లో వచ్చిన భరత్ అనే నేను పొలిటికల్ నేపధ్యంలో తెరకేక్కినా కానీ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని కొంచం మెసేజ్ కూడా ఇచ్చి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుని రేసులో నిలిచింది.

ఇక తర్వాత ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహానటి అందరి అంచనాలను మించే విధంగా ఓ ఎపిక్ క్లాసిక్ బయోపిక్ గా నిలిచి ఊహకందని విధంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లెజెండ్రీ సావిత్రి గారి గురించి తక్కువగా తెలిసిన నేటి తరం యూత్ ని కూడా మెప్పించింది.

సెకెండ్ ఆఫ్ లో విజయ్ దేవరకొండ గీత గోవిందం ఫ్యామిలీ అండ్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుని పెట్టిన డబ్బు కి కొన్న రేటు కి మించి ఎన్నో రెట్లు వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహలకు అందని విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటి లిస్టులో నిలిచింది.

తర్వాత టాలీవుడ్ కి పెద్దగా అచ్చి రాని రా అండ్ స్పై థ్రిల్లర్ జానర్ లో అల్టిమేట్ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా గూఢచారి, అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది.

ఇక ఇయర్ ఎండింగ్ కి ముందు అరవింద సమేత సినిమా మాస్ ని క్లాస్ ని ఆకట్టుకుని ఫ్యాక్షన్ వల్ల జరిగే పరిస్థితులకి అద్దం పడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలిచుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఈ లిస్టులో నిలిచింది.

మొత్తం మీద 6 సినిమాలు లిస్టులో నిలిచినప్పటికీ బెస్ట్ మూవీ గా నిలిచే అర్హతలు ఎక్కువగా రంగస్థలం మరియు మహానటి కి ఉండగా…అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎపిక్ క్లాసిక్ బయోపిక్ గా నిలిచినా మహానటి బెస్ట్ మూవీ అన్నది మా ఒపినీయన్…మరి మీ లెక్క లో బెస్ట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి..

31 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here