2020 ఇయర్ టాలీవుడ్ కి ఆల్ టైం బెస్ట్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ అది కేవలం మొదటి 2 నెలలకు మాత్రమే సరిపోయింది, మార్చ్ నెల నుండి పరీక్ష ల సమయం అవ్వడం తో సినిమాలు అన్నీ సమ్మర్ రేసు లో నిలవగా మార్చ్ రెండో వారం నుండి కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ అన్నీ మూసేయడం తో కొత్త సినిమాలు ఏవి లేకుండా నే ఆల్ మోస్ట్ ఇయర్ సగం మొత్తం గడిచి పోయింది.
ఈ 6 నెలల లో మొదటి మూడు నెలల్లో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవ్వగా తర్వాత మూడు నెలల్లో కొన్ని చిన్న మూవీస్ మాత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా కృష్ణ అండ్ హిస్ లీల హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ వైడ్ ఈ ఏడాది టాలీవుడ్ రికార్డులను గమనిస్తే… ముందుగా… బెస్ట్ బాక్స్ ఆఫీస్ ఓపెనర్ విషయానికి వస్తే 32.77 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు వసూల్ చేసి ఈ ఏడాది బెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ కొట్టింది, ఈ ఇయర్ లో ఇక ఈ రికార్డ్ ఇలానే ఉండే చాన్స్ ఉంది.
ఇక బెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికి వస్తే… అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అల వైకుంఠ పురం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం వరల్డ్ వైడ్ గా 110.7 కోట్ల షేర్ ని అందుకుంది, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా 88.25 కోట్ల షేర్ ని అందుకుని రికార్డ్ కొట్టింది, ఈ రికార్డ్ కూడా సేఫే…
ఇక బిగ్గెస్ట్ హిట్ విషయానికి వస్తే… అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన మూడో సినిమా అల వైకుంఠ పురం లో సినిమా నే సంక్రాంతి రేసులో అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, టోటల్ రన్ లో ఏకంగా 160 కోట్లకు పైగా షేర్ అందుకుని న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ విషయానికి వస్తే…. ఈ రికార్డ్ కూడా అల వైకుంఠ పురం లో సినిమా నే సొంతం చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సిరీస్ తప్పితే మరే సినిమా అందుకోలేని రేంజ్ లో..75.88 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది ఈ సినిమా…
ఇక అదే టైం లో హైయెస్ట్ లాస్ తెచ్చుకున్న సినిమా విషయానికి వస్తే…. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆల్ మోస్ట్ 20.3 కోట్ల మేర నష్టాన్ని సొంతం చేసుకుని ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ సినిమా గా నిలిచింది అని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది హిట్స్ విషయానికి వస్తే… సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం లో, భీష్మ మరియు హిట్ సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో హిట్ కొట్టగా డబ్బింగ్ మూవీ కనులు కనులను దోచాయంటే బ్రేక్ ఈవెన్ ని అందుకుంది.
ఇక రీసెంట్ గా వచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ టాక్ ని అందుకున్న సినిమా గా నిలిచింది. మిగిలిన సినిమాలు ఏవి కూడా హిట్ గీత కానీ హిట్ టాక్ ని కానీ అందుకోలేక పోయాయి. ఇవీ మొత్తం మీద టాలీవుడ్ ఫస్టాఫ్ లో…
సాధించిన కొన్ని రికార్డులు… అద్బుతమైన స్టార్ట్ దక్కినప్పటికీ కరోనా తో ఆల్ మోస్ట్ ఫస్టాఫ్ పూర్తీ అవ్వగా ఇక సెకెండ్ ఆఫ్ లో కూడా చాలా సమయం ఇలానే గడిచే అవకాశం ఉంది, సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు అన్ని పరిస్థితులు సద్దుకున్నాక థియేటర్స్ లో రిలీజ్ కావచ్చు.
కానీ దాని పై ఇంకా క్లారిటీ లేని పరిస్థితి ఉందని చెప్పాలి…. ఇయర్ ఎండ్ కి అయిన పరిస్థితి బాగుండి ఎప్పటి లానే భారీ ఎత్తున సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలని కోరుకోవాల్సిందే. మరి ఇయర్ ఎండ్ కి పరిస్థితి ఎ విధంగా ఉంటుందో వైరస్ కి విరుగుడు దొరికి సద్దుకుంటుందా లేక ఇలాగే కొనసాగుతుందో చూడాలి మరి…