ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఇండియా లో త్వరగా తేరుకుని వరుస హిట్స్ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో రచ్చ రచ్చ చేసిస ఇండస్ట్రీ టాలీవుడ్… సమ్మర్ వరకు వరుస హిట్స్ తో జోష్ అదిరిపోగా తర్వాత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మళ్ళీ స్లో అయినా ఇప్పుడు లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మొదటి రోజు 6.94 కోట్ల షేర్ ని…
తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా ఈ కలెక్షన్స్ నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనర్ గా నిలవగా దాంతో పాటు టాలీవుడ్ తరుపున ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఏ ప్లేసులో నిలిచింది అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఒకసారి….
టాప్ మూవీస్ లిస్టు ని గమనిస్తే… 8వ ప్లేస్ లో జాతిరత్నాలు సినిమా 3.88 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోగా, 7వ ప్లేస్ లో శ్రీకారం సినిమా 4.07 కోట్ల షేర్ ని ఫస్ట్ డే సాధించింది, ఇక 6వ ప్లేస్ కి వస్తే రంగ్ దే సినిమా 4.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే…
5వ ప్లేస్ ని రెడ్ మూవీ 5.47 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 4వ ప్లేస్ లో క్రాక్ సినిమా 6.25 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో ప్లేస్ లో లవ్ స్టొరీ సినిమా 6.94 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక రెండో ప్లేస్ లో ఉప్పెన సినిమా 9.35 కోట్ల షేర్ తో ఊచకోత కోసింది…
ఇక టాప్ ప్లేస్ లో వకీల్ సాబ్ సినిమా 32.24 కోట్ల షేర్ తో ఈ ఇయర్ భారీ మార్జిన్ తో ఫస్ట్ డే రికార్డ్ ను మెయిన్ టైన్ చేస్తూ వస్తుంది. లవ్ స్టొరీ కి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు బాగుంటే కచ్చితంగా టాప్ 2 ప్లేస్ తో రచ్చ చేసి ఉండేది, అలా మిస్ అయినా అల్టిమేట్ స్టార్ట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.