Home న్యూస్ డబుల్ మార్జిన్ తో ఆల్ ఇండియా రికార్డ్….మెంటల్ మాస్ ఇది!!

డబుల్ మార్జిన్ తో ఆల్ ఇండియా రికార్డ్….మెంటల్ మాస్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా వైడ్ గా తిరిగి మళ్ళీ అందరి కన్నా ముందు తేరుకుని కలెక్షన్స్ పరంగా యమ జోరు తో దూసుకు పోతున్న ఇండస్ట్రీ టాలీవుడ్ అనే చెప్పాలి… ఆల్ రెడీ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన మార్క్ తో…

భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఇతర ఇండస్ట్రీలలో హిట్స్ కోసం ఇంకా కష్టపడుతున్న టైం లో సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి ఆల్ రెడీ మంచి హిట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….. ఇండియా లో సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ గా సీటిమార్ సినిమా 5 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని ఇండియా ఫస్ట్ డే సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా….

ఆ రికార్డ్ ను ఇప్పుడు లవ్ స్టొరీ సినిమా డబుల్ మార్జిన్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది… ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో 10.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇండియా లో మొదటి రోజు 11.03 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుని ఊచకోత కోసింది…

దాంతో సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లో 10 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి సినిమాగా నిలిచింది, టాప్ 2 సినిమాలు టాలీవుడ్ వే ఉండగా మూడో ప్లేస్ లో డబ్ మూవీ షాంగ్ చీ 4.15 కోట్ల గ్రాస్ ని అందుకోగా 4 వ ప్లేస్ లో బాలీవుడ్ మూవీ బెల్ బాటం 3.55 కోట్ల తో ఉంది. లవ్ స్టొరీ ఊచకోత డబుల్ మార్జిన్ తో కొత్త బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ మూవీస్ కి సెట్ చేసింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here